సిపిఎం పార్టీ చేర్యాల పట్టణ నూతన కమిటీ ఎన్నిక
చేర్యాల పట్టణ నూతన కార్యదర్శిగా రాళ్ల బండి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నిక
సిద్దిపేట్ జిల్లా నవంబర్ 10
చేర్యాల సిపిఎం చేర్యాల పట్టణ కార్యదర్శిగా రాళ్ల బండి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నిక సిపిఎం చేర్యాల పట్టణ 20వ మహాసభ స్థానిక వాసవి గార్డెన్ లో ముత్యాల ప్రభాకర్ ఇప్పకాయల శోభ పోలోజు శ్రీహరి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పాల్గొని మాట్లాడుతూ. చేర్యాల పట్టణ సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం పార్టీని ప్రజలు ఆదరించాలని మహాసభల విజయవంతనికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మాసభలో సిపిఎం కార్యదర్శిగా రాళ్ల బండి నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆయన ప్రకటించారు దాని అనంతరం రాళ్ల బండి నాగరాజు మాట్లాడుతూ చేర్యాల పట్టణంలో అనేకమైన సమస్యలతో ఉన్నాయని వారు తెలియజేశారు ఆ సమస్యలను పట్టించుకునేటువంటి నాధుడు లేడని తెలిపారు. చేర్యాల పట్టణ నాలుగున్నర సంవత్సరాలు గడిచిన చేర్యాల పట్టణం అభివృద్ధికి వెనక్కి పోతుందని వారు తెలియజేసారు చేర్యాల పట్టణం సమస్యల పైన సిపిఎం పార్టీ నూతన కమిటీ పోరాటాల నిర్వహిస్తుందని వారు తెలియజేశారు నూతన పట్టణ కమిటీ సభ్యులుగా పోలోజు శ్రీహరి ముత్యాల ప్రభాకర్,ఆముదాల నర్సిరెడ్డి,బోయిన మల్లేశం ఇప్పకాయల శోభ,రాళ్ల బండి భాస్కర్ ఆముదాల రంజిత్ రెడ్డి,ఎర్ర బోసు అశోక్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
