గత రెండు రోజుల క్రితం మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులు మరణించి అనాధలుగా మారారని చిన్నారులకు ఎంత కష్టమొచ్చింది అని ప్రచురించిన కథనానికి స్పందించిన భరోసా ఫౌండేషన్ సభ్యులు శనివారం బాదిత కుటుంబాన్ని పరామర్శించి దాదాపు పదివేల రూపాయల విలువ చేసే నిత్యవసర సరుకులను బియ్యాన్ని అందజేసి తమ ఉదారత చాటుకున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు స్వామి మాట్లాడుతూ తల్లిదండ్రులు మరణించి అనాధలుగా మారిన సంఘటనను ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనానికి మా స్నేహితులతో చర్చించగా ప్రస్తుతం ఆ కుటుంబానికి నిత్యవసర సరుకులు అందిస్తూ భవిష్యత్తులో పిల్లల చదువులకై ఆర్థిక రూపేనా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భరోసా ఫౌండేషన్ సభ్యులు నరేష్, శివ, రాజు, ప్రసాద్ తదితరులు ఉన్నారు.
