ప్రాంతీయం

వెంకటేశ్వర ఆలయంలో మాస కల్యాణోత్సవం

87 Views

దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతినెల రెండవ శనివారం నిర్వహించే మాస కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోశ్ఛరణాల మధ్య స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిపారు. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించడంతోపాటు పల్లకి సేవ, అలంకరణ తదితర కార్యక్రమాలను ఆలయ పూజారి వెంకటేశం, ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు. కళ్యాణోత్సవంలో గంప మమత- రవి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పబ్బ మాధవి, పద్మ, శ్రావణి, అరుణ, వీరేశం, సతీష్, నరేష్, అశోక్, అంజయ్య, శివ, శ్రీనివాస్, చంద్రం, కిషన్, ఆలయ కమిటీ సభ్యులు శివరాములు తదితరులు పాల్గొన్నారు……

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7