ప్రాంతీయం

రానున్నది రామరాజ్యమే

69 Views

రానున్నది రామరాజ్యమే అది కేవలం బిజెపితోనే సాధ్యం

మండల బిజెవైఎం ప్రధాన కార్యదర్శి కొండ బాలకృష్ణ

గజ్వేల్ మే 11

కాంగ్రెస్ ఎన్ని అసత్యపు ప్రచారాలు,అబద్ధాలు చెప్పిన ప్రజలు బిజెపి వెంటే ఉన్నారని మండల బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కొండ బాలకృష్ణ అన్నారు. కొండ బాలకృష్ణ విలేకరుల సమక్షంలో మాట్లాడుతూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రజలు వేసే ఓటు ఈ దేశ సంక్షేమం దశా దిశను మార్చుతుందని అది కేవలం బిజెపితోనే సాధ్యమని మండల బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కొండ బాలకృష్ణ అన్నారు.గత పది ఏళ్లుగా నరేంద్ర మోది చేసిన అభివృద్ధి పనులను చూసి బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు కు అధిక మెజారిటీతో గెలిపించాలని జిల్లా ప్రజలను కోరారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కొరకై ప్రతి ఒక్క కార్యకర్త సమిష్టి కృషితో పనిచేయాలని యువత చైతన్యం అయ్యి,దేశంలో మోది ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ప్రపంచం మొత్తం మన భారతదేశం వైపే చూస్తున్నదని గడిచిన 10 సంవత్సరాలలో మోడీ దేశాన్ని ఊహించని రీతిలో ప్రపంచ దేశాలు కీర్తించేలా అగ్రభాగాన నిలిపారు అని అన్నారు.దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇంకా మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది తప్ప అభివృద్ధి చేయడానికి కాదని కొండ బాలకృష్ణ అన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్