మంచిర్యాల జిల్లా
*మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు *
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేయాలనుకున్న 18,500 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని ఆపిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజల తరఫున సంబరాలు చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపు మేరకు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు .
అనంతరం దివాకర్ రావు మాట్లాడుతూ పది సంవత్సరాల్లో ఏనాడూ విద్యుత్ చార్జీలు పెంచని మన ప్రభుత్వానికి భిన్నంగా కేవలం 10 నెలల్లోనే 18,500 కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వం చేయడంతో, ప్రధాన ప్రతిపక్షంగా వాటిని వ్యతిరేకించాలని పబ్లిక్ హియరింగ్‌లో బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్,హరీష్ రావు పాల్గొని ఈఆర్‌సీ (ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్)ని ఒప్పించగలిగారు అని అన్నారు.మొత్తం ఉమ్మడి రాష్ట్ర చరిత్ర నుంచి ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షం వాదనలోని సహేతుకతను, న్యాయాన్ని విని చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్‌సీ తిరస్కరించడం ఇదే మొదటిసారి అని దివాకర్ రావు అన్నారు.ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకను వినిపించిన ఈ సందర్భం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు.
