*రామగుండం పోలీస్ కమిషనరేట్*
???????? *మంచిర్యాల నుండి మహారాష్ట్రకు రహస్యంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్*
???????? *రాత్రి పూట కార్ లో ప్రాణహిత పరిసర గ్రామాలకు తరలిస్తూ, అర్ధ రాత్రి సమయంలో నాటు పడవల సహాయంతో మహారాష్ట్ర కు దాటవేత*
???????? *పక్కా సమాచారం తో మాటు వేసి పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు.
???????? *అక్రమంగా తరలిస్తున్న సుమారు 40 వేల రూపాయల విలువ గల మద్యం పట్టివేత, ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ స్వాధీనం.*
*రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ . ఎమ్. శ్రీనివాస్ ఐపీఎస్ (ఐజి)* ఆదేశాల ప్రకారం గురువారం రోజు రాత్రి టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న మరియు కోటపల్లి ఎస్సై రాజేందర్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి మంచిర్యాల నుండి మహారాష్ట్రకు కారులో రహస్యంగా తరలిస్తున్న అక్రమ మద్యాన్ని , కోటపల్లి మండలం సిర్సా గ్రామ ప్రాంతంలోని ఫెర్రీ పాయింట్ వద్ద పక్కా సమాచారం మేరకు ఆపి తనిఖీ చేయగా, అందులో సుమారు నలభై వేల రూపాయల విలువ గల మద్యం లభించింది.
పోలీసులు విచారణ చేయగా, కార్ డ్రైవర్ కిరణ్ దాన్ని మంచిర్యాల లోని లక్ష్మి బాలాజీ వైన్స్ లో తీసుకున్నట్టు, దానిని రహస్యంగా ప్రాణహిత పరిసర ప్రాంతాలకు తరలించి, అర్ధరాత్రిపూట నాటు పడవల ద్వారా మహారాష్ట్రకు తరలించి, అధిక ధరలకు అమ్మడం ద్వారా ఎక్కువ లాభాలు గడిస్తానని తెలియజేయడం జరిగింది.
పట్టుకున్న నిందితుడిని , స్వాధీనపరుచుకున్న మద్యాన్ని ,కార్ ను తదుపరి విచారణ నిమిత్తం కోటపల్లి పోలీస్ వారికి అప్పగించడం జరిగింది.
నిందితుడి వివరాలు:
1. పెండ్యాల కిరణ్
s/o రాజన్న , వయస్సు: 36,
సిర్సా గ్రామము, కోటపల్లి.
