మంచిర్యాల జిల్లా.
నేడు మంచిర్యాల జిల్లాలో పీజీ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఫీజు బకాయిలు చెల్లించాలని, అదేవిధంగా రావలసిన స్కాలర్షిప్ లు సకాలంలో అందించాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలో శాంతియుత ర్యాలీని విద్యార్థిని, విద్యార్థులు మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. మూడు సంవత్సరాల నుంచి రావాల్సిన ఫీజు బకాయిలను మరియు స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని నినాదాలు చేస్తూ గవర్నమెంట్ ను విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు.
ఈ శాంతియుత ర్యాలీ కార్యక్రమంలో పీజీ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు మరియు స్టూడెంట్ ఆర్గనైజేషన్, విద్యార్థి యూనియన్ మరియు విద్యార్థి సంఘాలు, నాయకలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
