ఘనంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జన్మదిన వేడుకలు.
మంచిర్యాల జిల్లా.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జన్మదినం సందర్భంగా ఈరోజు బీజేపీ శ్రేణులు మంచిర్యాల పట్టణంలోని హోటల్ సుచిత్ర ఇన్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో 46 మంది బీజేపీ కార్యకర్తలు రక్త దానం చేయడం జరిగింది. అనంతరం బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, నాయకులు మరియు కార్యకర్తలు రఘునాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రఘునాథ్ వారి సతీమణి స్రవంతి తో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పురుషోత్తం జాజు, పెద్దపల్లి పురుషోత్తం, గాజుల ముఖేష్ గౌడ్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, కొయ్యల ఎమాజీ, ఎనగందుల కృష్ణ మూర్తి, జోగుల శ్రీదేవి, రమేష్ జైన్, బియ్యాల సతీష్ రావు, అశ్విన్, రమణ రావు, గుండా ప్రభాకర్, అమిరిశెట్టి రాజ్ కుమార్, కుర్రె చక్రవర్తి, సత్రం రమేష్, బందెల రవి గౌడ్, నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, గడ్డం స్వామి రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.





