Breaking News

గూడూరులో ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

156 Views

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ డిపోలో సోమవారం రోజు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ 46వ ఆవిర్భావ దినోత్సవం కె. శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ D.మల్లికార్జున హాజరై ఫెడరేషన్ జండా ఆవిష్కరించి ఐక్య పోరాటాల ఆవశ్యకతను గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎం. రఘురామయ్య అధ్యక్షత వహించగా జెండా ఆవిష్కరణ వేదికను జీ.వీ.రమణయ్య గారు సుందరంగా తీర్చడం జరిగింది. అనంతరం గూడూరు డిపో సీనియర్ నాయకులు M. శేషయ్య రిటైర్డ్ SDI గౌరవ అతిథిగా విచ్చేసి ఫెడరేషన్ ఆవిర్భావ పూర్వాపరాలు మరియు ఫెడరేషన్ విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణ సి.ఐ.టి.యు నాయకులు కామ్రేడ్ జిల్లా సభ్యులు పి.శ్రీనివాసులు, అధ్యక్ష కార్యదర్శులు బి.వి రమణయ్య,ఎస్.సురేష్, సిహెచ్ రాము, డి.శ్రీధర్ కమిటీ సభ్యులు జీ.వీ.రమణయ్య ఎస్.ఎస్.వి.కృష్ణ, ఎం. రఘురామయ్య, పి.రమణయ్య, ఎం.గురవయ్య, కే.సుబ్రహ్మణ్యం ఎం.వెంకటేశ్వర్లు, కత్తి సుబ్రహ్మణ్యం, పి.కిరణ్, కే. సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్