Breaking News

ఎమ్మెల్యే ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు

66 Views

వరద బాధితులను ఆదుకునేందుకు పట్టణ పరిధిలోని సామాన్యుల సైతం ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు . తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే నివాసం వద్ద మరియు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన ఆనంద్ లక్ష రూపాయల విరాళం మరియు హరిబాబు 25 వేల రూపాయల విరాళం మరియు వెటర్నరీ డాక్టర్ సురేష్ 25వేల రూపాయలు విరాళం చెక్కులను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు .
గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పట్టణ పరిధిలో అనేకమంది సామాన్యులు స్పందించి విరాళాలు అందజేయడం అభినందనీయమని అన్నారు . వీరిని స్ఫూర్తిగా తీసుకొని అవకాశమున్న ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేయాలని పిలుపునిచ్చారు . గూడూరు పట్టణానికి ఆనంద్ లక్ష రూపాయలు మరియు సురేష్ 25000 రూపాయలు మరియు హరిబాబు 25000 రూపాయలు అందజేసి వారిలోని దాతృత్వాన్ని చాటుకున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు .

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్