గూడూరు నియోజకవర్గం వాకాడు లోని నేదురుమల్లి నివాసంలో ఆదివారం వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వాకాడు, కోట చిట్టమూరు మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులతో భేటీ అయ్యారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి అనుసరించాల్సిన వ్యూహం , ప్రతిపక్ష టిడిపి నుంచి స్థానికంగా వైసిపి నాయకులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈ సందర్భంగా చర్చించారు. పార్టీ బలోపేతానికి ఇప్పటినుండి నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని భవిష్యత్తులో పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి వైసీపీ అండగా ఉంటుందన్నారు.





