Breaking News

వరద సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే

69 Views

విజయవాడ లో సంభవించిన వరద బాధితుల సహాయక చర్యలలో భాగంగా
43వ డివిజన్ నందు సుమారు 700000 లక్షల రూపాయలతో 5000 వేల కుటుంబాలకు చీరలు,టవల్స్ మరియు మస్కిటో కాయిల్స్ ను అందించిన
గూడూరు ఎమ్మెల్యే
డాక్టర్ పాశిం సునీల్ కుమార్
మాట్లాడుతూ
సహాయక చర్యలలో భాగంగా మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు నన్ను ఇక్కడ ప్రాంతంలో పర్యటించి బాధితులకు కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేయాలని అన్నారు.
గత 2 రోజుల నుండి ఇక్కడ స్థానిక నాయకులతో కలసి పర్యటిస్తూ బాధితులకు కావలసినవి అందిస్తున్నాము.
ప్రతి కుటుంబాన్ని కలసి పరామర్శించి వారికి జరిగిన నష్టాన్ని రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రికి అందిస్తున్నాము.
గత పాలకుల మాదిరిగా తప్పించుకుని తిరిగె నాయకులు కాదు ఇపుడు పరిపాలిస్తుండేది. ఒక నిబ్బద్దత సమర్థవంత మైన నాయకుని ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము.
మా నాయకుడు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు.
మా నియోజకవర్గ నాయకులు గూడూరు మండలం నుండి 2.70 లక్షలు, వాకాడు మండలం నుండి 2 లక్షల రూపాయలు, చిల్లకూరు మండలం నుండి 11500 వేల రూపాయలు ఇలా సుమారు 700000 లక్షల రూపాయలతో ఈ డివిజన్ నందు 5000వేల కుటుంబాలకు చీరలు, టవల్స్, మస్కిటో కాయిల్స్ ను అందించాము.
ఇక్కడ నాయకుల సహకారం మరువలేనిది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధు సూధన్ రెడ్డి, మద్దాలి సర్వోత్తమ రెడ్డి,సతీష్ రెడ్డి, హరీష్ నాయుడు,నెలటూరు చిరంజీవి, చిట్టేటి కీరవాణి, పల్లమాల అనిల్, మల్లి పాపాయ్య తదితరులు పాల్గొన్నారు.7

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్