*తిరుపతి జిల్లా..వాకాడు మండలం*
*????తూపిలిపాలేం బీచ్ లో సముద్రంలో గల్లంతై ఇద్దరు యువకులు మృతి*????
*????మృతులు నాయుడుపేట ప్రాంతానికి చెందిన మునిరాజా,ఫయాజ్*
*????వినాయక నిమజ్జనం చేస్తుండగా సముద్రంలో మునిగి మృతి*
ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలి పాలెం బీచ్ వద్ద వినాయక చవితి నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది, బంగాళాఖాతం సముద్రంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా సముద్రంలో మునిగి ఇద్దరు యువకులు మృతిచెందారు….
నాయుడుపేట కామారెడ్డి సెంటర్ నుండి వినాయక నిమజ్జనానికి తూపిలిపాలెం బీచ్ కు వచ్చిన యువకుల్లో ముగ్గురు యువకులు సముద్రంలో గల్లంతయ్యారు వారిలో మునిరాజా, ఫయాజ్, అనే ఇద్దరు మృతి చెందగా మరో యువకుడిని గజ ఈతగాళ్లు సహాయంతో సురక్షితంగా బయటకు తీశారు….





