Breaking News

అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన   ప్రఫుల్ దేశయ్

117 Views

 

 

అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన

ప్రఫుల్ దేశయ్

కరీంనగర్ జిల్లా నూతన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా ప్రఫుల్ దేశయ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా జనగామ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రఫుల్ దేశాయ్ కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బదిలీ అయిన సందర్భంగా బుధవారం అయన జిల్లా కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చాంబర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించే ముందు కరీంనగర్ రెస్ట్ హౌస్ లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ను ప్రఫుల్ దేశాయ్ లను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి జగత్ సింగ్ , కరీంనగర్ ఆర్ డి ఓ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

సహయ సంచాలకు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ చే జారీ చేయనైనది

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *