Breaking News

అమరుల బలిదానాలను అవహేళన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం*

111 Views

ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట ఉమ్మడి మండల ప్రతినిధి,కె.జగదీశ్వర్*

*తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అమరుల బలిదానాలను అవహేళన చేస్తున్నట్లేనని ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీలక్ష్మణరావు మండిపడ్డారు. బుధవారం రోజున మండల కేంద్రం లో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నల్లబ్యాడ్జీలు ధరించి తెరాస కార్యాలయం నుండి కొత్త బస్టాండ్ వరకు నరేంద్ర మోడీ శవయాత్రను నిర్వహించారు అనంతరం మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు .రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని ప్రసంగించి మాట్లాడిన మాటలు హేయమైన చర్య అన్నారు. ఆరు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ప్రధాన మంత్రి మోడీ అవహేళన చేసే విధంగా పార్లమెంట్లో మాట్లాడడం తెలంగాణ పై ఆయనకున్న అక్కసును వెళ్లగక్కారన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు తెలంగాణలో ప్రత్యామ్నాయం అని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి నాయకులు నేడు ప్రధాని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష చెబుతారని విమర్శించారు రాజకీయ లబ్ధి కోసం దిగజారి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు మోసం చేసి నరేంద్ర మోడీ పదవులు పొందారని దుయ్యబట్టారు.కార్యక్రమంలో ఎంపీపీ రేణుక వైస్ ఎంపీపీ భాస్కర్ బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండ రమేష్ సెస్ మాజీ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు మామిండ్ల తిరుపతి బాబు తెరాస మండల అధ్యక్షుడు వర్ష కృష్ణ హరి జడ్పీ కోఆప్షన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చాంద్ పాషా ాజీ ఏఎంసి అందె సుభాష్ పట్టణ అధ్యక్షుడు బండారి బాల్ రెడ్డి ,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సీత్యా నాయక్ ఎంపిటిసిలు నాగరాణి అనసూయ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తెరాస బృందం పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7