Breaking News

చవితి ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి పూజలు ఎస్సై

37 Views

????”*వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి*

????”*ఓజిలి ఎస్ఐ కె .స్వప్న*

????”*వినాయక చవితి ఉత్సవాలు ఎదుటి వారికి ఇబ్బందులు కలుగకుండా నిర్వహించుకోవాలని ఓజిలి ఎస్ఐ కె. స్వప్న మండల ప్రజలకు సూచించారు.*

????”*ఈ సందర్భంగా ఓజిలి ఎస్ఐ కె. స్వప్న మీడియాతో మాట్లాడుతూ పెద్ద శబ్ధాలతో లౌడ్‌స్పీకర్లనువినియోగించకూడదన్నారు.*

????”*వినాయక ఉత్సవ కమిటీ వారు ముందుగానే పోలీసు అనుమతి తీసుకోవాలని ????*హెచ్‌టిటిపిఎస్‌//గణేష్‌ఉత్సవ్‌.నెట్‌కు “కు???? హాయ్‌ అని టైప్‌ చేసిన తరు వాత ఒక లింక్‌ వస్తుందని ఆ లింక్‌పై క్లిక్‌ చేస్తే ఓటీపీ వస్తుందన్నారు. ఆ తరువాత అప్లికేషన్‌ కోసం గూగుల్‌ ఫారమ్‌ ఓపెన్‌ చేసి అందులో ఉన్న కాలమ్స్‌ పూర్తిచేసి సబ్‌మిట్‌ చేయాలన్నారు. అనంతరం పోలీసులు విచారణ జరిపి సింగిల్‌ విండో పద్ధతి ద్వారాపర్మిషన్‌మంజూరవుతుందన్నారు.*

????”*మండల వ్యాప్తంగా పోలీస్‌ యాక్టు అమలులో ఉందని, ఎవరైనా ఉల్లంఘిస్తే సెక్షన్‌ 32 పోలీస్‌ యాక్టు ప్రకారం కాని లేదా బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 223 ప్రకారం ఆరు నెలల శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా లేదా రెండూ విధించబడతాయన్నారు. నిర్వాహకులు ముందుగా పోలీసు అనుమతి తీసు కోవాలన్నారు. రోడ్డుకు అంతరాయం లేకుండా విగ్రహాలను ఏర్పాటు చేసు కోవాలన్నారు. శబ్ద కాలుష్యం ఉపయోగించకూడదని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే లౌడ్‌ స్పీకర్లను వినియో గించుకోవాలన్నారు. రాత్రి వేళ మండపాల వద్ద కమిటీ సభ్యులు కాపలా ఉండాలన్నారు. నిమజ్జనానికి సంబంధించిన రూటు మ్యాప్‌ను ముందే తెలియజేయాలన్నారు. ఊరేగింపుల్లో బాణసంచా ఉపయోగించరాదని, డీజే శబ్దాలు, అస్లీల డాన్సులు నిరోధించాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కల్గించకూడదన్నారు.*

????”*పోలీస్‌ శాఖ సూచనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసే మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కనీసం ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో కమిటీగా ఏర్పడి వారి పూర్తి వివరాలను పోలీస్‌ స్టేషనుకు అందజేయాలన్నారు. పబ్లిక్‌, ప్రైవేట్‌ స్థలాల్లో వేడుకలు చేసుకునే వారు తప్పనిసరిగా ఆయా విభాగపు అధికారులు, సంస్థల యజమానుల అనుమతి తీసుకోవాలన్నారు7 తరం కాపలా, తాత్కాలిక సీసీ కెమెరాలు వంటివి కమిటీలు సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మండపాలు, విగ్రహాలు రోడ్డుపై ఉండ రాదని, బ్యానర్లు/ఫ్లెక్సీలతో ట్రాఫిక్‌ రాకపోకలకు అంతరాయం కలిగిస్తే చర్య లు తీసుకుంటామన్నారు. ఊరేగింపు సమయంలో పోలీస్‌ అనుమతి లేకుం డా వేషధారణలు, డీజే వంటివి నిషేధమన్నారు. అనుచిత, అసభ్య ప్రదర్శ నలు లేకుండా ఉత్సవ కమిటీ నిర్వాహకులే బాధ్యత వహించాలన్నారు.*9

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్