పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం బిజెపిని ఓడిద్దాం
డిసెంబర్ 22
సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట పార్లమెంటరీ, ప్రజాస్వామ్య విలువలని కాపాడుకోవాలని, దానికి భారత దేశ ప్రజలు సిద్ధం కావాలని, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలేని బిజెపిని ఓడించాలని, ధూల్మిట్ట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్దల మహేందర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఏఐసీసీ పిలుపుమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి మరియు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు, మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపి అనంతరం విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ, దేశంలో అపక్రటిత ప్రజాస్వామ్యం నడుస్తుందని, అందుకు కారణమే పార్లమెంటులో ఎంపీలను సస్పెండని తెలిపారు. ప్రజాస్వామ్య పార్లమెంటరీ విధానానికి లోబడి పని చేయాలి. కానీ దానికి విరుద్ధంగా మాట్లాడే స్వేచ్ఛను హరించి వేస్తున్నారని, పార్లమెంట్ భద్రత వైఫల్యాలపై స్పందించి, నిలదీసిన ఎంపీలను సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. దేశంలో మత చాందసవాద నియంతృత్వ ఏకపక్ష నిర్ణయాలను జరుగుతున్నాయని, మాట్లాడే మేధావులను జైల్లో నిర్బంధిస్తూ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడే, దండిస్తున్నారని, కావున వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించి ప్రజాస్వామ్య పాలనకు పునాది వేసే ఇండియా కూటమి గెలిపించాలని కోరుతున్నామని, అలాగే ఈ నియంత్రత పోకడల అవలంబిస్తున్న బిజెపి విధానాలను ఎండగట్టాలని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో గోనపల్లి పరశురాములు, తుషాలపురం రాజు, చెన్నోజు బ్రహ్మ చారి, కోల సత్యయ, తూశాలపురం మని, నచగొని సురేష్, సాయి పోతుగంటి సిద్దులు, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు





