*నాయుడుపేట నడిబొడ్డున గణనాధుడు*
*ఐదు రోజులపాటు భక్తులకు కనువిందు చేయనున్న బొజ్జ గణపయ్య*
*పొట్లపూడి రాజేష్. ప్రత్యేక శ్రద్ధతో..భారీ సెట్టింగ్ నడుమ. నాయుడుపేట భక్తులందరికీ అనుకూల వాతావరణం లో. ఏకదంతుడి విగ్రహాన్ని.. ఏర్పాటు*
తిరుపతి జిల్లా నాయుడుపేట నడిబొడ్డున ఉన్న. దర్గా వీధిలో.. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న వినాయక చవితి సందర్భంగా భారీ సినిమా సెట్టింగ్ తొ ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేయడం అందరికి తెలిసిందే…
ప్రతి సంవత్సరం.. ఎస్ జె జ్యువెలరీ అధినేత. పొట్లపూడి రాజేష్ ఆధ్వర్యంలో.. ఐదు రోజులపాటు వినాయక చవితిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు… అంతేకాకుండా ఆ ప్రాంత చుట్టుపక్కల భక్తులకు.. ఆ వక్రతుండ మహాకాయుడిని దర్శించుకోవడం.. ఆనవాయితి అనే చెప్పుకోవాలి…
అందుకు తగ్గట్లుగానే భక్తులకు అన్ని సౌకర్యాలు సమకూర్చి.. నిత్యం పూజలు అందిస్తూ… అత్యంత భక్తిశ్రద్ధలతో… ఆ గణేశుడి నిమజ్జనం వరకు.. నియమ నిష్టాలు పాటిస్తారు కార్యనిర్వాహకులు..
ఈ ఐదు రోజులు కొన్ని వేల మంది ఇక్కడ గౌరీ తనయుడిని దర్శించుకుంటారని నిర్వాహకులు చెప్తున్నారు…
*అన్ని అనుమతులతో*
ఈ కార్య నిర్వాహకులు. ఎన్నోవ్యయ ప్రయాసలు పడి.. అన్ని అనుమతులు. తెచ్చుకొని ఇక్కడ సెట్టింగ్ ఏర్పాటు చేస్తారు.. అటు పోలీసు శాఖ వారి నుంచి… ఇటు రెవెన్యూ శాఖవారి నుంచి… అనుమతులు తెచ్చుకున్నారు
హైదరాబాదు నుంచి విగ్రహం.
ఒరిస్సా నుంచి సినిమా సెట్టింగ్లూ.. ఇలా
అత్యంత ఖర్చుతో కూడుకున్న పని..
అయినా కూడా నాయుడుపేటలో ఆనవాయితీగా వస్తుంది కాబట్టి.. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా.. భక్తులకు వినూతన రీతిలో… ఆది దేవుడి దర్శనం కల్పించాలని. నిర్వాహకుల తాపత్రయం…
*రోడ్డును అడ్డగించారంటూ…*
రోడ్డును అడ్డగించి.. దేవుని ప్రతిష్టిస్తున్నారు అంటూ కొంతమంది…అంటున్నా ఇక్కడ మాత్రం అలాంటి.. పరిస్థితి ఏది కనపడటంలేదు….
వాహనాలు రాకపోకలకే ఇలాంటి అంతరాయం లేదు…
పోలీస్ వారి సహకారంతో.. ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా.. వారి పర్యవేక్షణలో నిత్యం ఇక్కడ… పహారా కాస్తున్నారు..
వీలయితే దైవకార్యాన్ని ప్రోత్సహించాలి గాని.. ఐదు రోజుల ఈ పండుగకి… అరిచి గీ పెట్టడం ఎందుకు అంటూ… నిర్వహకులు, కమిటీ సభ్యులు, వ్యాపారస్తులు, అంటున్నారు…





