పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్
ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రలయం వారి సహకారంతో రౌతు సూరమల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పా టు చేశామని మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరిశంకర్, సీఈవో సీతారామ నాయుడు ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ కంటి ఆరోగ్య సమస్యలకు సీనియర్ కంటి వైద్య నిపుణులైన అనుభవం గల స్పెషలిస్ట్ డాక్టర్ల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది అన్నారు. 
ఈ కంటి వైద్య శిబిరం లో 130 మంది కి పరీక్షలను ఉచితముగా నిర్వహంచి 50 మంది కి ఉచితముగా మందులు పంపిణీ 28 రోగులకు ఉచిత కంటి అద్దాలు, 24 మంది కి ఉచితంగా ఆపరేషన్ లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో
గ్రామ పెద్దలు రాజేంద్రనాథ్ రెడ్డి,
ట్రస్ట్ AO
కృష్ణ గల్లా, అరవింద్ నేత్ర లయ సిబ్బంది శంకర్ , తదితరులు పాల్గొన్నారు.





