పార్టీ ని నాయుకుడిని మోసం చేసి ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్సీ లను , ఎంపీ లను ఇక ఎప్పటికీ ప్రజలు విశ్వరించరు. ఇది అనైతికం.. *
*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
—————————————-
నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో *జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.*
– ఎన్నికల్లో గెలవని వారిని గౌరవించి సామాజిక న్యాయం లో భాగంగా అణచి వేయబడుతున్న వర్గాల వారిని సైతం గుర్తించి రాజ్యసభ, శాసనమండలికి పంపితే..
– పదవులను అనుభవించిన వాళ్ళే జగన్ ని మోసం చేస్తున్నారు..
– చంద్రబాబు హామీలను అమలు చేయలేక పార్టీ పిరాయింపులను ప్రోత్సహించి..డైవర్షన్ పాలిట్రిక్స్ చేస్తున్నారని, అమ్మ ఒడి ఇప్పటి వరకు ఇవ్వలేదు.. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ అని చెప్పి.. ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారునమ్మక ద్రోహం చేసిన వారికి భవిష్యత్తు ఉండదనే విషయాన్నీ పార్టీ మారే వాళ్ళు గుర్తు పెట్టుకోవాలన్నారు.
దుర్గా ప్రసాద్ ని ని టీడీపీ నిర్లక్ష్యం చేస్తే.. 2019లో జగన్ టికెట్ ఇచ్చి ఎంపీ గా గెలిపించుకున్నారనీ అయన మరణంతరం బల్లి కళ్యాణ్ చక్రవర్తికికి ఎమ్మెల్సి జగనన్న ఇచ్చారన్నారు. అలానే బీదా మస్తాన్ రావునీ గౌరవించి పార్టీ లో చేరగానే ఎంపీ గా అవకాశం ఇచ్చారు
అధికారం కోసం నేడు వారు పార్టీ మారాలనుకోవడం దారుణం.. టీడీపీ నిర్లక్ష్యం చేసిన వారిని జగన్ అక్కున చేర్చుకుని పదవులు ఇస్తే.. వాళ్లే ఇప్పుడు జగన్ ని మోసం చేస్తున్నారన్నారు.
