24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 23)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి గ్రామంలో మంగళవారం సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ మంజుల శ్రీరాములు ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం మాట్లాడుతూ యువతకు ఆదర్శం సుభాష్ చంద్రబోస్ అని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని భారత దేశ స్వాతంత్ర ఉద్యమం లో సుభాష్ చంద్రబోస్ పాత్ర మరువలేనిది అని,అజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి భారత దేశం విదేశీ కబంధ హస్తాల నుంచి విముక్తి చేయడం కోసం చేసిన వారి కృషి మరువలేనిది అని గణేష్ పల్లి లో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహించడం అభినందనీయం అని అన్నారు ఈ కార్యక్రమంలో అంగడి కిష్టాపుర్ సర్పంచ్ లక్ష్మి రాములు గౌడ్, నర్సన్నపెట్ సర్పంచ్ మాధవి రాజిరెడ్డి, ఎర్రవల్లి ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ, సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా, టీచర్ రామకృష్ణ రెడ్డి,గణేష్ పల్లి గ్రామ ఉప సర్పంచ్ మహేష్,నాయకులు నర్సింలు, రామరాజు, భీమ్ రాజు,వెంకటేష్,స్వామి,మధు పంతులు,గణేష్ యూత్ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు





