???? రాముని చెరువు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ సార్ 88వ జయంతి వేడుకలు.
తేదీ…6..2024 మంగళవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 88వ జయంతిని ఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమాని కన్నా ముందు జయశంకర్ సార్ చిత్రపటానికి పలువురు వాకర్స్ పూల మాలలు వేసి వినంభ్రంగా నివాళులు అర్పించినారు.ఈ సందర్భంగా పలువురు వాకర్స్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనునిత్యం పరితపించి మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి మలి దశ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా నిలిచి తన చివరి శ్వాస వరకు రాష్ట్ర సాధనే ధ్యేయంగా అలుపెరుగని పోరాటం చేసిన జయశంకర్ సార్ అని కీర్తించినారు.జయశంకర్ సార్ మరణం తెలంగాణ ప్రజానీకి తీవ్ర నష్టమని సార్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు.అదేవిధంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆచార్య జయశంకర్ సార్ కౌశ్య విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరినారు.ఈ సందర్భంగా జయశంకర్ సార్ కు జోహార్లు,జయశంకర్ సార్ అమర్ హై అని పెద్ద పెట్టున నినాదాలు చేసినారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య,మున్సిపల్ మసూద్, రాజేందర్, పల్లపు తిరుపతి, వాకర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీలు పుప్పిరెడ్డి రాంరెడ్డి, పూదరి నరసయ్య, సలహాదారులు,కార్యవర్గ సభ్యులు G. సత్యనారాయణమూర్తి,. సత్యనారాయణ, కరుణానందం,సోమన్న,నరేష్ తదితరులు పాల్గొన్నారు.
