-అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లో చేరుతున్న ఇతర పార్టీ నాయకులు
– కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే
మానకొండూర్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేస్తున్న అభివృద్ధి ని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న ఇతర పార్టీల నాయకులు, యువకులు
మానకొండూర్ నియోజకవర్గం గన్నెరువరం మండలంలోని గుండ్లపల్లె గ్రామానికి చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీ లకు చెందిన సుమారు 250 మంది కార్యకర్తలు,నాయకులు, యువకులు తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు వారికీ ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు….
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ…
పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసే పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో ముందంజలో ఉందని రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని ఇతర పార్టీలకు తెలంగాణలో తావులేదని గమనించే పలు పార్టీల నేతలు వలసలు వస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ విజయానికి యువత కృషి చేయాలని,కాంగ్రెస్ విధానం మూడు గంటల కరెంటు బీఆర్ఎస్ విధానం మూడు పంటలకు కరెంటు అని, అధికారంలోకి రాకముందే రైతు వ్యతిరేక విధానాలు ప్రవేశపెడతామంటున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, రైతు వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్, బిజెపికి బుద్ధి చెప్పాలని, రైతు బాంధవుడైన కెసిఆర్ని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చుకోవాలని,దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు జరుగుతున్నాయని అన్నారు.