రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామ సమీపంలో గల మల్లికార్జున స్వామి ఉత్సవాలలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి రైతులు బాగుండాలని మల్లికార్జున స్వామిని వేడుకున్నట్లు తెలిపారు అంతేకాకుండా రైతులు ఎప్పటికీ కూడా నష్టపోకుండా ఉండాలని దేశానికి వెన్నెముక రైతు అన్నారు ఈ ఉత్సవాలలో పాల్గొన్న యాదవ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు వారు కోరిన చిన్న సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తారని అన్నారు ఇలాంటి సంప్రదాయ పండుగలు చేయడం మూలంగా హిందువులలో భక్తి భావం పెంపొందుతుందన్నారు మన సంస్కృతి మన సాంప్రదాయాలు నైతిక విలువలు పెరుగుతాయి అన్నారు యాదవ సంఘం నాయకులు లంబ ఎల్లయ్య బుర్రవేణి ఎల్లయ్య లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసన్ సన్మానించారు అనంతరం రాచర్ల గొల్లపల్లి ఎల్లారెడ్డిపేట మధ్య కొత్తగా నిర్మాణం చేసిన దుర్గమ్మ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు అందె బాలయ్య బాబయ్య ఎల్లయ్య కుల సంఘం పెద్దమనుషులు ఆయనను సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య నాయకులు కొమిరిశెట్టి తిరుపతి చేపూరి రాజేశం. కొండాపురం శ్రీనివాస్ రెడ్డి. పందిర్ల సుధాకర్ కిష్టారెడ్డి లక్ష్మణ్ బండారి బాల్ రెడ్డి. రాంరెడ్డి చెన్నిబాబు తదితరులు పాల్గొన్నారు
