రైతు రుణమాఫీ హర్షనీయం !
– దయ్యాల యాదగిరి
గజ్వేల్ , జులై 21
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేయడం హర్షణీయం అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దయ్యాల యాదగిరి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఒకటవ వార్డ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దయ్యాల యాదగిరి మాట్లాడుతూ రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని, బడుగు బలహీనవర్గాలకు మేలు చేకూర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేయడం హర్షణీయం అని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.అలాగే గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని అన్నారు.
