ప్రాంతీయం

బొగ్గు గని విశ్రాంతి కార్మికుల కనీస వేతన పెంపు

78 Views

మంచిర్యాల జిల్లా

బొగ్గుగని విశ్రాంత కార్మికులను కనీస పెన్షన్ 1000 రూ  గా పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నము.

కనీస పెన్షన్ 15000 వెలుగా పెంచాలని కేంద్రప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నాము. .

ఇటీవల CMPF ట్రస్ట్ బోర్డ్ మరియు కేంద్ర ప్రభుత్వం బొగ్గు గని విశ్రాంత కార్మికులకు కనీస పెన్షన్ 1000 వెయ్యి రూపాయలుగా పెంచుతున్నామని వారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు కట్టపైన జరిగిన జిల్లా తెలంగాణ సింగరేణి విశ్రాంత కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకించినది ఖండించినది.

బొగ్గుగని విశ్రాంత కార్మికులకు కనీస కోల్ మైన్స్ పెన్షన్ 15000 వెలుగా నిర్ణయించి ఇవ్వాలని CMPF ట్రస్ట్ బోర్డును మరియు కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ రోజు జరిగిన విశ్రాంత కార్మిక సంఘం డిమాండ్ చేసింది.

1998 లో కోల్ ఇండియా యాజమాన్యం 5 జాతీయ కార్మిక సంఘాలు చేసుకున్న ఒప్పందం మేరకు మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కోల్ మైన్స్ పెన్షన్ పెంచాలని ఒప్పందం ఉన్నప్పటికీ గత 25 సంవత్సరాల నుండి ఒక్క శాతం కూడా పెన్షన్ పెంచకపోవడం CMPF ట్రస్టు బోర్డు మరియు కేంద్ర ప్రభుత్వం దివాలా కోరుతనానికి నిదర్శనమని సమావేశంలో మండిపడ్డారు. మీరు పెంచిన 1000 రూపాయలతో బొగ్గు పెన్షన్ దారుల కనీస మౌలిక అవసరాలు తీరుతాయ అని ప్రశ్నించారు. విశ్రాంత బొగ్గుగని కార్మికులు దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడే వారికి 1000 రూపాయలు ఏమూలకు సరిపోతాయో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేసినారు. విశ్రాంత కార్మికులు, ఆర్థిక ఇబ్బందులు తీరాలన్న రెండు పూటలు గడపాలన్న వైద్యానికి ఖర్చులు తీరాలన్న బొగ్గుగని విశ్రాంత కార్మికులకు 15,000 గా కనీస పెన్షన్ ఇవ్వాలని ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఈ సమావేశంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షుడు రాజన్న, నాయకులు B. లక్ష్మీనారాయణగౌడ్,K. బాబు,A. చంద్రయ్య,T. మలేష్, సత్యనారాయణమూర్తి, సూర్యనారాయణ గౌడ్,K. ప్రకాష్,T. రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్