రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్ 24/7:
సోమవారం రోజున జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ ఎస్.ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో గంభీరావుపేట్ మండలం,గజసింగవరo గ్రామంలో కొండ అనిల్ కుమార్, తండ్రీ రాములు,35 సo; లు, అనే వ్యక్తి తన వైశ్య రాజరాజేశ్వర కిరాన షాప్ లో నిషేధిత గుట్కా విలువ అందజ 12000/-రూపాయలు అమ్ముతున్నాడాన్నా నమ్మదగిన సమాచారం మేరకు వెళ్లి తనిఖీ చేయగా ప్రభుత్వ నిషేధిత గుట్కా ను పట్టుకోవడం జరిగింది.అట్టి గుట్కా ప్యాకెట్ల స్వాధీన పరుచుకొని గుట్కా ను వ్యక్తిని తదుపరి విచారణ నిమిత్తం గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగిందిని,అలాగే జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ నిషేధిత అంబర్ జర్ధా, గుట్కా ప్యాకెట్ల అమ్మితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భముగా అన్నారు. జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ నిషేధిత అంబర్ జర్దా, గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారనే సమాచారం ఉంటే డయల్ 100, కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ శ్రీనివాస్ సిబ్బంది రమేష్,తిరుపతి,రాజేష్ ఆక్సర్ లు పాల్గోన్నారు.
