ఎల్లారెడ్డిపేట మండలంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు బొమ్మాడి స్వామి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది బొమ్మిడి స్వామి మాట్లాడుతూ నిన్నటి రోజున నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ హైదరాబాదులో నివాసంపై టిఆర్ఎస్ గూండాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడడం జీర్ణించుకోలేక బీసీ నాయకులపై దాడికి దిగడం దొర అహంకారానికి నిదర్శనం బీసీలను తెలంగాణలో ఎదగనీయకుండా అణిచివేయడానికి కూట్రలో భాగంగానే ధర్మపురి అరవింద్ నివాసంపై టిఆర్ఎస్ గుండాలు దాడి చేయడం జరిగింది దీనిని భారతీయ జనతా పార్టీ బీసీ మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది
రాబోయే రోజులలో భారతీయ జనతా బీసీ మోర్చా దాడులకు ప్రతి దాడులు తప్పవని టిఆర్ఎస్ గుండాలకు హెచ్చరించారు తెలంగాణలో బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి టీఆర్ఎస్ చేస్తున్న అరాచక పాలాన్ని తరిమికొట్టాలని కోరారు కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి జిల్లా కార్యదర్శి బుగ్గారెడ్డి
బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మేడిశెట్టి బాలయ్య జిల్లా అధికార ప్రతినిధి బంధారపు లక్ష్మారెడ్డి ఓబిసి మోర్చా మండల ఉపాధ్యక్షుడు మిరియాలకార్ రవి
పట్టణ అధ్యక్షుడు నెవురి శ్రీనివాస్ రెడ్డి వాణిజ్య సెల్ జిల్లా కన్వీనర్ చందుపట్ల రాజిరెడ్డి బీజేవైఎం జిల్లా కార్యదర్శి దుస శ్రీనివాస్ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు గడ్డం రవి వంగల రాజు పొన్నాల కార్తీక్ చేకూటి అనుష్ ఎలుసానిపరుశరాములు రెడ్డి , సాయి కిరణ్ నాయక్ సితాల సాగర్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు
