దోపిడీ చేస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి
ఇష్టరీతిలో అధిక ధరలకు పుస్తకాలు,యూనిఫామ్ అమ్ముతున్న అధికారుల చర్యలేవి
జేరిపోతుల జనార్దన్,ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి,సిద్దిపేట
సిద్దిపేట్ జిల్లా జూన్ 21
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యాశాఖ, మున్సిపల్ శాఖ అధికారుల అనుమతి లేకుండా పాఠ్యపుస్తకాలు,యూనిఫారం, స్టేషనరీ అధిక ధరలకు విక్రయిస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్ డిమాండ్ చేశారు..
శుక్రవారం రోజున సిద్దిపేట జిల్లా కేంద్రంలోని చైతన్య స్కూలుకు సంబంధించిన ఎలాంటి పర్మిషన్ లేని పుస్తకాల అమ్మక కేంద్రం వద్ద పుస్తకాలను, యూనిపాం లను పట్టుకొని స్టోర్ ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు..
అనంతరం విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా విద్యాధికారులు అక్కడికి చేరుకొని తనిఖీ నిర్వహించారు.. పుస్తకాల అమ్మకంతో పాటు నోట్ బుక్స్, యూనిఫార్మ్స్, టై, బెల్టు లను పరిశీలించారు.. పుస్తకాల అమ్మకాలలో బిల్లులు సక్రమంగా లేకపోవడం ప్రభుత్వ పాఠ పుస్తకాల సిరీస్ కాకుండా తామే స్వతహగా ముద్రించిన శ్రీ చైతన్య స్కూల్ పాఠ్యపుస్తకాల విక్రయిస్తున్న స్టోర్ ను తాళం వేశారు..
ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యాసంస్థలు దోపిడీకి పాల్పడుతున్నాయని, నిబంధనలు పాటించడం లేదని ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అధిక ధరలకు పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్నారని,వీటిపైన విద్యాధికారులు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు.. నిబంధనలు పాటించని శ్రీ చైతన్య స్కూళ్లను మూసివేయాలని డిమాండ్ చేశారు.. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా విద్యను వ్యాపారం చేస్తున్నారని, విద్యా సంవత్సరం ప్రారంభంలో స్కూల్ యూనిఫాంలను ఎక్కడ దొరకని పాఠ్యపుస్తకాలను స్కూల్ యాజమాన్యాలు స్వతహాగా ముద్రించి ఆయా స్కూల్లకు సంబంధించిన స్టాళ్ల లో అమ్ముతున్నారని ఆరోపించారు.. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే తమ పిల్లలను ఎక్కడ ఇబ్బందులకు గురి చేస్తారని తల్లిదండ్రులు ఈ బాధలను ఎవరికి చెప్పుకోలేకపోతున్నారని వాపోయారు..విద్యార్థుల తల్లిదండ్రులు ఏఐఎస్ఎఫ్ దృష్టికి ప్రయివేట్ విద్యాసంస్థల ఆగడాలను తీసుకువస్తే విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఏఐఎస్ఎఫ్ గా ఆయా స్కూళ్లపై ఉద్యమం నిర్వహిస్తామని ఆయన అన్నారు..ఇప్పటికైనా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రయివేట్ విద్యాసంస్థలపై కఠినంగా వ్యవహరించాలని ప్రైవేట్ స్కూళ్లపైన తనిఖీలు చేయకుండా తూతూ మంత్రంగా ఉంటే ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతున్నాయని తక్షణమే జిల్లా వ్యాప్తంగా డీఈవో, ఎంఈఓ లు నిబంధనలు పాటించని స్కూళ్లపైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డీఈఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన అన్నారు..ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంగెం మధు, జిల్లా సహాయ కార్యదర్శి వేల్పుల ప్రసన్నకుమార్, జిల్లా నాయకులు బానోతు నవీన్, సిద్దుల సుమన్,చట్ల సమ్మయ్య, రాకేష్, రమేష్, ఆదిత్య,వెంకట్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు..
