(శంకరపట్నం మే 28)
శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో మంగళవారం టీఎస్ ఆర్టిసి డ్రైవర్ పై ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు.
వివరాల్లోకి వెళితే కరీంనగర్ నుండి హనుమకొండ వైపు వెళ్తున్న, హనుమకొండ డిపోకు చెందిన బస్సు TS03UC6568 డ్రైవర్ విజయేందర్ పై తాడికల్ గ్రామానికి చెందిన గాలిపల్లి అనిల్ అనే వ్యక్తి దాడి చేశాడు.
బస్సు డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో అదే సమయంలో బస్సుకు ఎదురుగా వస్తున్న గాలిపల్లి అనిల్ బస్సు తన మీదికే వస్తుందని భ్రమపడి,ఆగ్రహంతో ద్విచక్ర వాహనంను బస్సుకు ఎదురుగా నిలిపి బస్సును ఆపి లోపలికి ప్రవేశించి డ్రైవర్ పై విచక్షణారహితంగా చెప్పు తో దాడి చేశాడు.
దాడి చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు ప్రయాణికులు తెలిపారు.
ఈ సంఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలైనాయి గమనించిన ప్రయాణికులు ,కండక్టర్ సదరు వ్యక్తిని ,పట్టుకొని అదే బస్సులో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి గాలిపల్లి అనిల్ పై ఫిర్యాదు చేసినారు.
ఏం జరుగుతుందో ఏమోనని కాసేపు బస్సులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురైనట్లు తెలిపారు.
డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు శంకరపట్నం ఎస్ఐ, పాకాల లక్ష్మారెడ్డి తెలిపారు.




