మంచిర్యాల జిల్లా
*30 కిలోల నకిలీ విడి పత్తి విత్తనాలు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్, తాండూర్ పోలీసులు*
రామగుండం పోలీస్ కమిషనరేట్,మంచిర్యాల జిల్లా లోని తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు తేది 24.05.2024 టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది, మండల్ వ్యవసాయ అధికారి మరియు తాండూర్ పోలీస్ వారి ఆధ్వర్యములో కొత్తపల్లి గ్రామం , తాండూర్ మండలము లోని *ఎర్రవోతు రాజు S/o రామచందర్, 29 సం//, కులం :- మున్నూరు కాపు* , అను అతని ఇంటిలో నకిలీ విత్తనాలు నిల్వ ఉంచడనే ఒక నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీ చేయగా 30 కిలోల నకిలీ విడి పత్తి విత్తనాలు దొరికినవి . ఇట్టి విడి నకిలీ పత్తి విత్తనాలను *తిరుమల శెట్టి రామ కృష్ణ S/o సుబ్బారావు , R/o పున్నుర్ గ్రామo , ప్రకాశం జిల్లా , ప్రస్తత నివాసం , రోల్లపాడు గ్రామం , తక్కలపల్లి గ్రామ పంచాయతి , రెబ్బెన మండలం* అను అతని దగ్గర కొనుగోలు చేసినాను అని చెప్పినాడు ఇట్టి విషయం మీద కేసు చేసి దర్యాప్తు నిమిత్తం నకిలీ పత్తి విత్తనాలను స్వాదిన పర్చుకొని, స్వాదిన పర్చుకున్న వాటిని తదుపరి విచారణ నిమిత్తం తాండూర్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది.
రైతులను మోసం చేయాలని ఉద్దేశ్యం తో నకిలీ విడి పత్తి విత్తనాలు ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరు ఇన అమ్మితే వారి మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేయబడును. రైతులు ఎవరు కూడా నకిలీ విడి పత్తి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు అని తెలియచేశారు .
*నిందితుల వివరాలు*
ఎరబోతు రాజు s/o. రాంచందర్, వయస్సు:29, తారాగణం: M కాపు, OCC: వ్యవసాయం R/o. కొత్తపల్లి,తాండూర్ మండలం.
తిరుమలశెట్టి రామకృష్ణ S/o. సుబ్బారావు, రెబ్బన ఆసిఫాబాద్ జిల్లా రోళ్లపాడు. N/o . పున్నూరు ప్రకాశం జిల్లా. ఆంధ్రప్రదేశ్.
