రాజకీయం

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి…

102 Views

–భాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి.

–తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి.

(తిమ్మాపూర్ మే 19)

తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి డిమాండ్ చేసారు.బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల గడుస్తున్నా కూడా అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల మండలంలో జరిగిన నష్టంపై ఎటువంటి అంచనాలు కూడా తీసుకోకుండా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కూలిన ఇండ్ల కే కాకుండా పశువుల కొట్టాలకు, రేకుల ఇండ్ల కు కూడా ఆర్థిక సహాయం అందించేలా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని భాధితులకు అండగా ఉండాలని డిమాండ్ చేసారు.

అకాల వర్షాల తాకిడికి నష్టపోయిన భాధితుల పక్షాన బీజేపీ భరోసా ఉంటుందని పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేసేవరకు పార్టీ పక్షాన డిమాండ్ చేసే కార్యక్రమాలలో భాగంగా సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో కార్యకర్తలు, రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజల సంక్షేమం కోసం ఆలోచించేది బీజేపీ యేనని అందుకే బండి సంజయ్ రైతుల విషయంలో దృష్టి సారించారని తెలిపారు. ప్రజల పక్షాన పోరాడేది బీజేపీ తప్ప బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కావని అన్నారు.

జిల్లా కార్యవర్గ సభ్యులు చింతం శ్రీనివాస్,మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర అనిల్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కంది రాజేందర్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి వేల్పుల రవీందర్ యాదవ్,ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ శ్రీనివాస్ గౌడ్,తొర్తి సంతోష్, పబ్బ తిరుపతి,రామిడి మహేందర్ రెడ్డి, పోరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్