Breaking News

పిడుగు పడి ఆవు, ల్యాగ మృతి…

311 Views

(తిమ్మాపూర్ మే 16)

పిడుగు పడి ఆవు, ల్యాగ మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన ఎనుగుల మల్లయ్య అనే రైతు తన పాడి ఆవును వ్యవసాయ పొలం వద్ద కట్టేసాడు. గురువారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు అధికమై ఆవు, ల్యాగ ఉన్న ప్రాంతంలో పిడుగు పడింది. మల్లయ్య బావి వద్దకు వెళ్లి చూసేసరికి ఆవు, ల్యాగ మృతి చెందింది.

తమ కుటుంబానికి జీవనాధారంగా ఉన్న సుమారు లక్ష ఇరవై అయిదు వేల రూపాయల విలువ గల ఆవు, ల్యాగ చనిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ, తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.

No Slide Found In Slider.

Poll not found