ఆధ్యాత్మికం

ఆవాలతో గురుదేవుని అద్భుత చిత్రం

105 Views

– గురుభక్తిని చాటుకున్న రామకోటి రామరాజు

జులై 21,గజ్వేల్:

గురుపౌర్ణమి పురస్కరించుకొని గురుదేవుని చిత్రాన్ని ఆవాల గింజలను ఉపయోగించి అత్య అద్భుతంగా రూపొందించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తన గురుదేవులకు అంకితమిచ్చి తన గురుభక్తిని చాటుకున్నాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే, జ్ఞాన భిక్షతో పునర్జన్మనిచ్చి జీవితానికి సార్థకత నిచ్చే వారే గురువన్నారు. అజ్ఞానమనే చీకటివల్ల మూసుకుపోయిన కళ్ళను జ్ఞానమనే వెలుగులోకి ప్రకశింపజేసే అతనే గురువన్నారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థను బీటుకూరి రాఘవాచార్యుల ఆశీషులతో ప్రారంభించానన్నారు. నేడు రామకోటి సంస్థ ద్వారా లక్షల మంది భక్తులు ప్రతిరోజూ రామ నామాన్ని లిఖిస్తున్నారంటే దానికి మూల కారణం గురువే అన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్