పోరుగడ్డ ఓరుగల్లు కు బయలుదేరిన ఉద్యమ నేత బిఆర్ఎస్ అధినేత కేసిఆర్
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
మర్కుక్ ఏప్రిల్ 28
పోరుగడ్డ ఓరుగల్లు కు బయలుదేరిన గులాబి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రం నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో వరంగల్ రోడ్ షోకు బయలుదేరారు. వరంగల్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి అయిన సుధీర్ కుమార్ గెలుపు కోసమై ఉమ్మడి వరంగల్ బిఆర్ఎస్ ముఖ్య నేతల బహిరంగ రోడ్ సభ ప్రచారానికి బయలుదేరారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించనున్నారు. బిఆర్ఎస్ పార్టీ ప్రచార రథం అయినా బస్సులో ఘట్కేసర్ బైపాస్,భువనగిరి బైపాస్ నుండి జనగాం స్టేషన్ గన్ పూర్ మీదగా వరంగల్ రోడ్ షోలో ప్రచారంలో పాల్గొంటారు.
