(కరీంనగర్ ఏప్రిల్ 23)
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తిమ్మాపూర్ మండల మాజీ ఎంపీపీ కుంట రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్ మండల మాజీ ఉపాధ్యక్షులు, రామకృష్ణ కాలని రెడ్డి సంఘం అధ్యక్షులు దావు సంపత్ రెడ్డి మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కుంట రాజేందర్ రెడ్డి, దావు సంపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూదగోని లక్ష్మీనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమణారెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మామిడి అనిల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాచర్ల అంజయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మాచర్ల శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రెడ్డిగాని రాజు, గ్రామశాఖ అధ్యక్షులు అలువాల కుమార్, నాయకులు బుధారపు శ్రీనివాస్, సిరికొండ కొండల్ రావు, కొమ్మెర మల్లారెడ్డి, వేల్పుల భూపతి, రావుల కాదు శ్రీధర్,కొమ్మెర విజేందర్ రెడ్డి, గంగు నరేష్ అలువాల అనిల్, గంధం రాజు తేలికొండ రాము తదితరులు పాల్గోన్నారు..