ప్రాంతీయం

ఇంద్రవెల్లిలో అమరవీరులకు నివాళులు అర్పించిన సీతక్క

118 Views

ఆదిలాబాద్ జిల్లా:

మరో జలియన్ వాలాభాగ్ దురంతంగా చరిత్ర పుటల్లో కెక్కిన ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు సరిగ్గా ఈరోజు కు 43 ఏళ్లు నిండాయి. జల్ ..జంగల్.. జమీన్ నినాదంతో భూమి, భుక్తి అడవి పై హక్కు కోసం ఆదివాసీలు సంఘటితమై 1981 ఏప్రిల్ 20న ఇంద్ర వెల్లి లో సభ నిర్వహిం చారు.

కాల్పుల్లో 13 మంది చని పోయారని అధికారులు ప్రకటించగా, అనధికారిక లెక్కల ప్రకారం 113 మంది చనిపోయినట్టు ఆదివాసు లు పేర్కొన్నారు. అయితే మరుసటి సంవత్సరమే కాల్పుల ఘటన స్థలిలో అమరవీరుల స్థూపం నిర్మించిన ఆదివాసీలు ప్రతి ఏటా అక్కడ నివాళులర్పిం చడం ఆనవాయితీగా వస్తోంది.

నివాళులర్పించిన సీతక్క
అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఇంద్రవెల్లిలో ఈరోజు మధ్యాహ్నం పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అయిన ధనసరి సీతక్క అమర వీరులకు నివాళులు అర్పించారు.

కాల్పుల ఘటనను దురదృష్టక సంఘటనగా పేర్కొంటూ అమరవీరుల ఆశయాలు సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంద న్నారు. ఆదివాసి సంఘాలు స్మారక స్థూపం వద్ద ప్రత్యేక సాంప్రదాయ పూజలు నిర్వహించి అమరవీరులను స్మరించుకుంటూ మౌనంగా నివాళులర్పించారు.

అమరవీరులకు జోహార్లు అన్న నినాదాలు ఇంద్రవెల్లి అడవుల్లో మార్మోగాయి. అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు తుఫాన్ వద్ద పూజలు చేసి నివాళులర్పిం చారు. కాల్పులు జరిగి నలభై ఏళ్లు దాటినా ఇంకా భూమి కోసం ఆదివాసి బిడ్డలు పోరాడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

No Slide Found In Slider.

Poll not found