ప్రాంతీయం

లోక్ సభ ఎన్నికల నామినేషన్ ఏర్పాట్ల పరిశీలన

100 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబందించిన ఏర్పాట్లు పరిశీలించిన సీపీ.

నామినేషన్ల ప్రక్రియకు మూడు అంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటు: పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,

నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు మూడు అంచెలా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేపట్టామన్నారు.

రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ , పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్., తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ నామినేషన్స్ ప్రక్రియలో చేయవలసిన భద్రత ఏర్పాట్లను, ఎంట్రెన్స్, ఎగ్జిట్ దారులు, పార్కింగ్ ఏర్పాటు, మీడియా పాయింట్ ఏర్పాట్లలను పరిశీలించారు.

ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ…., లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు జరుగుతుందని, రిటర్నింగ్ అధికారి చాంబర్ ను సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని దానికోసం సెంట్రల్ ఫోర్స్, అర్ముడ్ మరియు సివిల్ ఫోర్స్ తో మూడు అంచెలా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది అని సీపీ తెలిపారు. కమిషనరేట్ వ్యాప్తంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ పరంగా అవసరమైన అన్ని భద్రతా చర్యలు, పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని రిటర్నింగ్ అధికారి చాంబర్ నుండి 100 మీటర్ల పరిధిలో ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు.

ఈ కార్యాక్రమం లో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, పెద్దపల్లి సీఐ కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బా రెడ్డి,ఎస్ఐ లక్ష్మణ్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్