తుక్కుగూడ లో కాంగ్రెస్ జనజాతర భారీ బహిరంగ సభ.
కార్యకర్తలు భారీగా తరలి రావాలని పరమేశ్వర్ రెడ్డి పిలుపు
ఉప్పల్ ఏప్రిల్ 5
దేశంలో మోడీ పాలన పోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే మనమంతా సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలోని అన్ని ఎంపీలను గెలిపించుకోవాలని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా తుక్కుగూడలో ఈనెల 6న తలపెట్టిన జన జాతర బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఉప్పల్ నియోజకవర్గం ప్రతి డివిజన్ నుంచి వేలాది మందిని తరలించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. జన జాతర బహిరంగ సభ విజయవంతానికి ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో సన్నాహక సమావేశాలను పరమేశ్వర్ రెడ్డి నిర్వహించారు.
