– డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ను సందర్శించిన జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్
డ్రాగన్ ఫ్రూట్ తోటతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని కరీంనగర్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు ఏర్పాటు చేసిన డ్రాగన్ ఫ్రూట్ తోట ను గురువారం సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్ మాట్లాడుతూ..
డ్రాగన్ ఫ్రూట్ తోటను ఒక్క సంవత్సరం కష్టపడి సాగు చేస్తే 25 సంవత్సరాల పాటు రైతులకు ఫలాన్ని ఇస్తూ ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. మొదట కాస్త పెట్టుబడి ఎక్కువగా ఉన్నా తర్వాత నిర్వాహణ వ్యయం మాత్రమే ఉంటుందని చెప్పారు. తక్కువ నీటి ఖర్చుతో సాగు చేసే డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ప్రతి ఒక్కరూ మొగ్గు చూపాలని సూచించారు. మిగిలిన పంటలతో పోలీస్తే డ్రాగన్ ఫ్రూట్ తెగుళ్ల బారిన తక్కువగా పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు.. తోటను రైతు పింగిలి క్రిష్ణరెడ్డితో కలసి తిరిగి పరిశీలించారు.మా తండి పొత్సాహంతో తోటను అభివృద్ధి పరిచినట్లు రైతు క్రిష్ణరెడ్డి తెలిపారు. తోటను పరిశీలించి ఆరోగ్యవంతంగా సేద్రీయ పద్దతిలో పెంచుతున్న రైతును అభినందించారు. తక్కువ వ్యయంతో సాగు చేసేందుకు మరింత మెరుగైన పద్దతులు సూచించారు. ఆసక్తి గల రైతులు హరిత హారం లో భాగంగా మొక్కలను కూడా పెట్టుకోవాలని తెలిపారు. వినియోగదారులకు తక్కువ ధరలో మంచి పోషకారం అందుబాటులో ఉంటుందని వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ షాబాన, పద్మపాణి స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కానిగాంటి మధుకర్ రెడ్డి, మహిళరైతు పింగిలి పింగిలి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు..