(తిమ్మాపూర్ ఏప్రిల్ 03)
కరీంనగర్ జిల్లా పాలనధికారి ప్రమేల సత్పతి ఆదేశాలనుసారం బుధవారం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని గొల్లపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు నుస్తూలపూర్ సొసైటీ సిబ్బంది తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని అమ్మి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరన పొందాలన్నారు. ఏ గ్రేడ్ కి రూ.2203 బి గ్రేడ్ కి రూ.2183 మద్దతు ధర నిర్దేశించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రం ఇంచార్జి గడ్డం మహేందర్ రైతులు పింగిలి కృష్ణ రెడ్డి,మామిడి విద్యాసాగర్,వేల్పుల మధు,సాయిల్ల మల్లవ్వ ,వెన్నం సుధాకర్ రెడ్డి,మల్లెతుల తిరుపతి,తాళ్లపల్లి సంతోష్, కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి, రేషవేణి మల్లయ్య, మల్లెతుల రాజయ్య, హమాలీలు తదితరులు పాల్గొన్నారు..