Breaking News

ఘన సన్మానం

87 Views

జమాతే ఇస్లాం హిందూ ఆధ్వర్యంలో పేట భాస్కర్ కు ఘన సన్మానం

కోరుట్ల ఏప్రిల్ 3

ఈమధ్యనే ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రిసెర్చ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డ్ పొందిన సామాజిక ఉద్యమనేత తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ ను జమాతే ఇస్లాం హిందూ కోరుట్ల కమిటీ నాయకులు అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.

జమాతే ఇస్లాం హిందూ కోరుట్ల అధ్యక్షులు ఎం డి ఇలీయాస్ ఖాన్,ఉపాధ్యక్షులు రిటైర్డ్ ప్రోపెసర్ నయిమోద్దిన్ ఆద్వర్యంలో నాయకులతో కలిసి పేట భాస్కర్ ను ఘనంగా సన్మానించారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ పేట భాస్కర్ విద్యార్థి దశ నుండే బడుగు బలహీన నిరుపేదల పక్షాన నిలబడడం అది ఇప్పటివరకు కొనసాగించడం భాస్కర్ చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడుతూ డాక్టరేట్ అవార్డ్ రావడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో అద్యాత్మిక వక్త మహ్మద్ షేక్, నాయకులు చెన్న విశ్వనాథం, సుతారి రాములు,లతీప్,మసూద్ అలీ,అజ్మదుల్లాఖాన్,రాంబాబు, రాజేష్ ,వంశీ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్