క్రీడలు

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే…

375 Views

(తిమ్మాపూర్ జనవరి 10)

తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో టాక్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన మానకొండూర్ నియోజకవర్గం స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రికెట్ ఆడి సందడి చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..

క్రీడాల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు.క్రీడలు మానసిక ఉల్లాసనికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ టోర్నమెంట్ నిర్వహణకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *