(మానకొండూర్ మర్చి 16)
ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.ఇందులో భాగంగా మానకొండూర్ మండల కేంద్రంలోనూ ఆ పార్టీ నాయకులు నిరసనకు దిగారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకరపట్నం జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి నోరుజారారు. అయన మాట్లాడుతూ కవిత అరెస్ట్
కావడం. మనమందరం కలుసుకోవడం సంతోషంగా
ఉందని కామెంట్స్ చేశారు.
ఆయన వ్యాఖ్యలు విన్న అక్కడ ఉన్నవారంతా ఖంగుతిన్నారు.
ఈ నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సైతం అయోమయానికి గురయ్యారు. ఇదే సమయంలో తప్పు గ్రహించుకున్న జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి నాలుక కరుచుకున్నాడు. జరిగిన పొరపాటును గ్రహించుకుని వెంటనే సరి చేసుకుని మాట్లాడారు.
కానీ జడ్పీటీసీ మాట్లాడిన మాటలను అక్కడ వున్నా వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..