బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మండల రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు గన్న మల్లారెడ్డి
ఎల్లారెడ్డిపేట మార్చి 13 ;
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మండల రెడ్డి సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు గన్న మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా గన్న మల్లారెడ్డి మాట్లాడుతూ 2014లో జరిగిన ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీలో చేరానని గత పది సంవత్సరాలుగా పార్టీలో పనిచేసిన తనకు ఎలాంటి గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లా నాయకత్వం లోపంతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు,
