-అలుగునూరు చౌరస్తాలో బిజెపి శ్రేణుల రాస్తారోకో…భారీగా స్తంభించిన ట్రాఫిక్…
-బిజెపి నేతలను బలవంతంగా అరెస్టు చేసి పీటిసీకి తరలించిన పోలీసులు…
బిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలం…
పథకాలు అందించకుండా పేద ప్రజలను గోసపెడుతున్న కెసిఆర్ సర్కార్..
కెసిఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది…
రాస్తారోకో కార్యక్రమంలో బిజెపి నేతల వ్యాఖ్యలు..
నిరుపేదలైన పేద ప్రజలకు డబల్ బెడ్ రూమ్ లు అందించాలని, 2014 ,2019 ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలని, అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు శుక్రవారం మానకొండూరు అసెంబ్లీ, కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ ల ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు రోడ్డెక్కారు. అలుగునూరు చౌరస్తా కూడలిలో సుమారు అరగంట పాటు రాస్తారోకో చేపట్టారు.ఈ రాస్తారోకోతో హైదరాబాద్, వరంగల్ ప్రధాన రహదారి లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి 30 మందికి పైగా బిజెపి నేతలను బలవంతంగా వ్యాన్ లో ఎక్కించి చేసి పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించి కేసు నమోదు చేసారు.
ఈ సందర్భంగా బిజెపి ముఖ్య నేతలు మాట్లాడుతూరాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికల హామీల మేరకు , ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, రెండు పర్యాయాలు ఎన్నికల సందర్భంగా ప్రకటించిన పథకాల ను ఇంకా సక్రమంగా అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో కెసిఆర్ సర్కార్ ఉన్నందుకు సిగ్గుపడాలన్నారు.రాష్ట్రంలోని కెసిఆర్ సర్కార్ మాటల ప్రభుత్వమని, పథకాలు సక్రమంగా అమలు చేయలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వమన్నారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా డబల్ బెడ్ రూమ్ ఇల్లులు, వివిధ రకాల పింఛన్లు, రేషన్ కార్డులు, దళిత బంధు , నిరుద్యోగ భృతి లాంటి హామీలను అమలు చేయడంలో కెసిఆర్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. అర్హులైన ప్రజలు ఎంతోమంది ఉన్నా నేటికీ ప్రభుత్వ పథకాలు అందడం లేదని , ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమన్నారు.మళ్లీ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని
అనేక మోసపూరితప్రకటనలు చేస్తున్నారనీ, .
బీసీబంధు, మైనారిటీ బంధు, గిరిజన బంధు , గృహలక్ష్మి లాంటివి ప్రకటించారు కానీ ఎవరికీ ఒక్క రూపాయి ఎవ్వరికి ఇవ్వడం లేదనీ విమర్శించారు.కెసిఆర్ఇవన్నీ ఎన్నికల కోసమే ప్రకటిస్తున్నారనీ, కెసిఆర్ మాటలకు చేతలకు పొంతనలేదనీ, కెసిఆర్ మోసపు మాటలు ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరని, రాబోయే కాలంలో కేసీఆర్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.రాష్ట్ర నాయకులు బాస సత్యనారాయణ,గుగ్గిళ్ల రమేష్, బంగారి రాజేంద్ర ప్రసాద్, ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి,దరువు ఎల్లన్న, జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శులు తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్లెం వాసుదేవారెడ్డి,ఉపాధ్యక్షులు మాడ వెంకట్ రెడ్డి,గుర్రాల వెంకట్ రెడ్డి,గడ్డం నాగరాజు, సొల్లు అజయ్ వర్మ,అధికార ప్రతినిదులు బొంతల కళ్యాణ్ చంద్ర, జానపట్ల స్వామి,మానకొండూర్ అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్,తిమ్మాపూర్, గన్నేరువరం,మానకొండూర్, ఇల్లంతకుంట మండలాల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, నగునూరి శంకర్, రాపాక ప్రవీణ్, నాగసముద్రం సంతోష్ తో పాటుగా 200 మంది కార్యకర్తలు రాస్తారోఖోలో పాల్గొన్నారు.