రాజకీయం

రేవంత్ రెడ్డి సభా ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

280 Views

(తిమ్మాపూర్ నవంబర్ 22)

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ పార్టి ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల ప్రచార బహిరంగ సభకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టి కార్యకర్తలు, లీడర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొరపల్లి రమణ రెడ్డి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు పరిశీలించారు.. ఈ సభ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుందునా రేవంత్ రెడ్డి సభకు నియోజకవర్గంలోని మానకొండూర్ మండలంతో పాటు, కేశపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలకు చెందిన కార్యకర్తలు, లీడర్లతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలను సభకు హాజరయ్యే విధంగా చూసుకుంటున్నాము.

ఈ మేరకు బుధవారం ఉదయం రేణికుంట లో సభ ఏర్పాట్లను రమణారెడ్డి తో పాటు నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పరిశీలించారు. దాదాపు 50 వేల మందితో మానకొండూర్ బహిరంగ సభ జరుగుతుందని వెల్లడించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని మారుమూల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలను తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నిమగ్నమై ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *