సిద్దిపేట్ జనవరి 31: ఉల్లి పంట ఉత్పత్తిలో రాణిస్తున్న రైతును సన్మానించిన భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు.
సిద్దిపేట జిల్లా (హుస్నాబాద్ నియోజకవర్గం / కోహెడ మండలం ) మండల కేంద్రంలో ఉల్లి గడ్డ పంటను అత్యధిక దిగుబడి సాదించి అమ్ముతున్నా గంగాధర బాలయ్య అనే రైతును ప్రముఖ సామజిక కార్యకర్త, పిడిశెట్టి రాజు అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా సన్మానం చేసి ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం వారు మాట్లాడుతూ బెజ్జంకి మండలం షీలాపూర్ పల్లి గ్రామానికి కీ చెందిన ఉల్లి గడ్డ రైతు రెండు ఎకరాలు వేసి మూడు లక్ష రూపాయల పంటను తీసి ఉల్లి పంటలో విశేషంగా రాణిస్తున్న బాలయ్య బుధవారం మండల కేంద్రంలో తన ట్రాక్టర్ లో ఉల్లిగడ్డ ను అమ్ముతున్నా వారిని పలువురు ప్రత్యేకంగా అభినందించారు. పెట్టుబడి ఇతర ఖర్చులు పోనూ మంచి లాభం ఉంటుందనీ రైతు తెలిపారు. ఈకార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జాక్ కన్వీనర్ మంద మల్లేశం, ఉస్మానియా విశ్వవిధ్యాలయం తెలుగు పరిశోధకులు వేల్పుల శంకర్,పవ్వాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.




