Breaking News

ఎన్నికల సైరన్

367 Views

మోగిన సింగరేణి ఎన్నికల సైరన్

హైదరాబాద్:సెప్టెంబర్ 27

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. అక్టోబర్‌ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎల్‌సీ ప్రకటించారు.

ఈ మేరకు ఆయన బుధవారం ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అక్టోబర్‌ 6, 7 తేదీల్లో నామినేషన్లు స్వీక రించనున్నారు.ఆ తర్వాత స్క్రూటిని,విత్‌ డ్రాకు అవకాశం ఇవ్వనున్నారు.

28 న పోలింగ్‌ నిర్వహించనుండగా.అదే రోజు కౌంటింగ్‌ చేపట్ట నున్నారు. అయితే, మే 22న సింగరేణి ఎన్నికలు నిర్వ హించాలని కేంద్ర కార్మిక సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అయితే, వరుసగా పండగలు ఉండడంతో వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. సింగరేణి సంస్థ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు..అక్టోబర్‌ లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *