Breaking News రాజకీయం

కల్వకుర్తి-కొల్లాపూర్‌ రోడ్డు పనులు షురూ

54 Views

రాష్ట్ర ప్రజలకు మరో ప్రతిష్ఠాత్మక రోడ్డు అందుబాటులోకి రానున్నది. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్‌ వరకు నిర్మించే ఈ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి.

కృష్ణా నదిపై 4 లేన్ల ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణానికి సన్నాహాలు

హైదరాబాద్‌-తిరుపతి మధ్య 50 కి.మీ. తగ్గనున్న ప్రయాణ దూరం

రాష్ట్ర ప్రజలకు మరో ప్రతిష్ఠాత్మక రోడ్డు అందుబాటులోకి రానున్నది. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్‌ వరకు నిర్మించే ఈ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. కృష్ణా నదిపై 4 లేన్ల ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం ద్వారా ఏపీలోని నంద్యాల వరకు సాగే ఈ రోడ్డుతో హైదరాబాద్‌-తిరుపతి మధ్య ప్రయాణ దూరం దాదాపు 50 కి.మీ. మేరకు తగ్గుతుంది. ప్రస్తుతం ఈ ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణం టెండర్ల దశలో ఉన్నది. ఏపీలో భూసేకరణ సమస్యల వల్ల ఈ రోడ్డు నిర్మాణం నత్తనడకన సాగుతున్నప్పటికీ తెలంగాణలో టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో పనులు చేపట్టారు.

కల్వకుర్తి టౌన్‌లోని జంక్షన్‌ నుంచి ప్రారంభమైల్‌ నాగర్‌కర్నూ, కొల్లాపూర్‌, సోమశిలతోపాటు ఏపీలోని సంగమేశ్వరం, ఆత్మకూర్‌, వెలుగోడు మీదుగా నంద్యాల వరకు సాగే ఈ రోడ్డును కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ 167కేగా ప్రకటించింది. ఇది కల్వకుర్తి జంక్షన్‌ వద్ద ఎన్‌హెచ్‌ 765తో అనుసంధానమవుతుంది. మొత్తం మూడు ప్యాకేజీలుగా విభజించిన ఈ రోడ్డును రూ.3,382 కోట్లతో నిర్మించనున్నారు. దీనిలో భాగంగా తెలంగాణలో 87 కి.మీ. రోడ్డు నిర్మాణానికి రూ.887 కోట్లు వెచ్చించనున్నారు. రాష్ట్రంలో 7 మేజర్‌, 24 మైనర్‌ జంక్షన్ల గుండా సాగే ఈ రోడ్డపై 2 మేజర్‌, 33 మైనర్‌ బ్రిడ్జీలతోపాటు 4 అండర్‌పాస్‌లను నిర్మించనున్నారు.

కల్వకుర్తి-నంద్యాల రోడ్డు విశేషాలు

మొత్తం రోడ్డు పొడవు 174 కిలోమీటర్లు.
తెలంగాణలో 87 కి.మీ, ఏపీలో 87 కి.మీ. పొడవున ఈ రోడ్డును నిర్మిస్తారు.

ఈ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించారు.
ప్యాకేజీ-1లో భాగంగా కల్వకుర్తి-కొల్లాపూర్‌ సెక్షన్‌లో 79.3 కి.మీ. రోడ్డు నిర్మిస్తారు.

కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్‌ కేబుల్‌ వంతెనను ప్యాకేజ్‌-2లో చేర్చారు.

తెలంగాణ వైపు నిర్మించే 8 కి.మీ. అప్రోచ్‌ రోడ్డుతోపాటు ఏపీ వైపు నిర్మించే 5.4 కి.మీ. అప్రోచ్‌
రోడ్డును కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీగా చేపడుతున్నది.

ప్యాకేజీ-3లో భాగంగా ఏపీలోని సంఘమేశ్వరం-నంద్యాల సెక్షన్‌లో 80.2 కి.మీ. రోడ్డు నిర్మిస్తారు.

మంజూరైన నిధులు రూ.887 కోట్లు.
సేకరించిన భూమి 277ఎకరాలు.

రెండు లేన్లతో 71.6 కి.మీ. పొడవు ఉండే ఈ రోడ్డుకు ఇరువైపులా పేవ్డ్‌ షోల్డర్స్‌ ఉంటాయి.

కల్వకుర్తి టౌన్‌ వద్ద పేవ్డ్‌ షోల్డర్స్‌తో 5.7 కి.మీ. పొడవున నిర్మించే రెండులేన్ల రోడ్డుకు ఇరువైపులా సర్వీస్‌ రోడ్లు ఉంటాయి.

మొత్తంగా 7 మేజర్‌ జంక్షన్లు, 26 మైనర్‌ జంక్షన్ల మీదుగా సాగే ఈ రోడ్డులో 2 మేజర్‌, 33 మైనర్‌ బ్రిడ్జీలతోపాటు 4 అండర్‌పాస్‌లు నిర్మిస్తారు.
ఐకానిక్‌ బ్రిడ్జి విశేషాలు ఏపీ వైపు పనుల పురోగతి

జూరైన నిధులు రూ.975 కోట్లు.
రోడ్డు పొడవు 80.2 కిలోమీటర్లు.

భూసేకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది.
సోమశిల, సిద్ధేశ్వర ఆలయాలు ఈ మార్గంలోనే ఉంటాయి.

ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌-తిరుపతి మధ్య ప్రయాణ దూరం 50 కి.మీ. తగ్గుతుంది.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *